హైదరాబాద్, తెలంగాణ

తెలంగాణ సారస్వత పరిషత్తు

ప్రచురణలు

పరిషత్తు ప్రచురించిన విలువైన గ్రంథాలను తెలుసుకోండి.

గ్రంథ ప్రచురణ

పరిషత్తు ప్రధానాశయాలలో గ్రంథ ప్రచురణ ఒకటి. ఇప్పటివరకు 160 ఉత్తమ గ్రంథాలు ప్రచురించింది. ఇవి పండితులకు, పరిశోధకులకు, విద్యార్థులకు, నూతన అక్షరాస్యులకు, పిల్లలకు ఇలా అన్ని వర్గాల వారికి ఎంతో ఉపకరిస్తున్నాయి. పరిషత్తు ప్రచురణలలో అత్యుత్తమ ప్రమాణాలు సంతరించుకున్న గ్రంథాలెన్నో ఉన్నాయి. ఉదాహరణకు ఆంధ్రుల సాంఘిక చరిత్ర. దీని రచయిత శ్రీ సురవరం ప్రతాపరెడ్డి. తెలుగులో తొలి సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్న మహనీయుడు. పరిషత్తు గ్రంథాలు కొన్ని విశ్వవిద్యాలయాలలో పాఠ్యాంశాలుగా ఉన్నాయి. ప్రపంచ రాజ్య సర్వస్వము అనే గ్రంథం భారతీయ భాషలలో ఈ అంశంపై వెలువడిన మొట్టమొదటి గ్రంథం. జాతీయ, అంతర్జాతీయ విషయాలు, వివరాలపట్ల ఆసక్తి ఉన్న వారికి ఈ గ్రంథం కరదీపిక వంటిది.

డా. దివాకర్ల వేంకటావధాని — ఆంధ్రవాఙ్మయ చరిత్ర, డా. నేలటూరి వెంకట రమణయ్య — ఆంధ్రుల చరిత్ర, డా. బూర్గుల రామకృష్ణారావు — సారస్వత వ్యాస ముక్తావళి, శ్రీ రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ — శాలివాహన గాథాసప్తశతి సారం, శ్రీ ఆదిరాజు వీరభద్రరావు — జీవిత చరిత్రలు, డా. దేవులపల్లి రామానుజరావు — సారస్వత మంజూష, శ్రీ సన్నిధానం సూర్యనారాయణ శాస్త్రి — కావ్యాలంకార సంగ్రహము వంటి ఎన్నో అపూర్వ కృతులను పరిషత్తు పాఠకలోకానికి అందించింది. పరిషత్తు వెలువరించిన కొన్ని ముఖ్య గ్రంథాలను దిగువ చూడవచ్చు.

గ్రంథాల జాబితా

  1. ఆదిమవాసులు
  2. ప్రాక్పశ్చిమ తత్వశాస్త్ర చరిత్ర (ప్రథమ సంపుటం)
  3. ప్రాక్పశ్చిమ తత్వశాస్త్ర చరిత్ర (ద్వితీయ సంపుటం)
  4. పద్యమంజరి
  5. స్త్రీల రామాయణపు పాటలు
  6. హైదరాబాదులో స్వాతంత్ర్యోద్యమం
  7. తెలుగు సాహిత్యంలో రామకథ
  8. భాషా చారిత్రక వ్యాసావళి
  9. తెలుగులో పదకవిత
  10. తెలుగులో హరివంశములు
  11. హరివంశములు (ఉత్తర భాగం)
  12. ఆంధ్ర సారస్వత పరిషత్తు చరిత్ర
  13. ఆంధ్ర సాహిత్య వికాసము
  14. తెలుగు వ్యాకరణ సంగ్రహము
  15. నా రేడియో ప్రసంగాలు
  16. భారతీయ వాస్తు శిల్ప విజ్ఞానం
  17. పరశురామపంతుల లింగమూర్తి
  18. ప్రపంచరాజ్య సర్వస్వము
  19. రత్నావళి
  20. సుమతి, వేమన పద్య సంకలనము
  21. నా సాహిత్యోపన్యాసాలు
  22. కాకతీయ శాసన సాహిత్యము
  23. తెలుగు సాహిత్యం – మరోచూపు
  24. సంస్కృత వాఙ్మయ చరిత్ర (ప్రథమ సంపుటము)
  25. మన నదులు కృష్ణా–గోదావరులు
  26. తెలుగులో వెలుగు
  27. మన జాతి నిర్మాతలు
  28. సంస్కృత వాఙ్మయ చరిత్ర
  29. గౌతమబుద్ధుడు – జవహర్‌లాల్ నెహ్రూ
  30. ప్రసంగ వ్యాసాలు
  31. మల్లికా గుచ్ఛము
  32. శ్రీ వేదం వేంకటరాయశాస్త్రి
  33. శాలివాహన గాథాసప్తశతి సారము
  34. రాయప్రోలు రచనల పరిశీలన – తత్వవివేచన
  35. తెలుగు నాటక సాహిత్యం
  36. ప్రాచీన కవిత
  37. ఇరివెంటి వ్యాసాలు
  38. సినారె సాహిత్య సమాలోచనం
  39. తెలుగు పీఠిక
  40. వ్యాస ప్రభాకరము
  41. దశరూపకసారము
  42. తెలంగాణలో జాతీయోద్యమాలు
  43. తెనుగు సాహితి
  44. డా. దేవులపల్లి రామానుజరావు అభినందన సంచిక
  45. తెలుగు సాహిత్యోద్ధారకులు
  46. ఆంధ్ర సారస్వత పరిషత్తు చరిత్ర
  47. మధురభక్తి – ముగ్ధభక్తి
  48. ఆంధ్ర సారస్వత పరిషత్తు స్వర్ణోత్సవ సంచిక
  49. సంస్కృత పాఠవల్లరి
  50. సామాన్య విజ్ఞానం
  51. పరిణతవాణి (మొదటి సంపుటి)
  52. గద్యసంగ్రహం
  53. తెలుగు రచన
  54. నీతిపద్యమంజరి
  55. పద్యసంకలనము
  56. పరిణతవాణి (రెండవ సంపుటి)
  57. సమీక్షణం
  58. ఆంధ్ర సారస్వత పరిషత్తు వజ్రోత్సవ సంచిక
  59. కృష్ణ శతకము
  60. సుమతి శతకము
  61. వేమన శతకము
  62. తెలుగు వాగ్గేయకారులు – అన్నమయ్య విలక్షణ వ్యక్తిత్వం
  63. ఆధునిక తెలుగు సాహిత్యంలో విభిన్న ధోరణులు
  64. పరిణతవాణి (మూడవ సంపుటి)
  65. శివరాత్రి మాహాత్మ్యము
  66. సాహిత్యానువాదం – సమాలోచనం
  67. ఆంధ్ర మహాభారతోపన్యాసములు
  68. ఆధునిక తెలుగు సాహిత్యంలో హాస్యం
  69. సాహిత్య సోపానములు
  70. పరిణతవాణి (నాల్గవ సంపుటి)
  71. ఆంధ్రభాగవతోపన్యాసములు
  72. మన హాస్యము
  73. పరిణతవాణి (ఐదవ సంపుటి)
  74. తెలుగు భాషా సాహిత్య వైశిష్ట్యం
  75. ఆంధ్ర వాఙ్మయ చరిత్ర
  76. విమర్శక వతంసులు
  77. గద్యకుసుమావళి
  78. పద్యకుసుమావళి
  79. తెలంగాణలో తెలుగు సాహిత్య వికాసం
  80. పరిణతవాణి (ఆరవ సంపుటి)
  81. వ్యాసగుచ్ఛం (మొదటి భాగం)
  82. వ్యాసగుచ్ఛం (రెండవ భాగం)
  83. ప్రాచీన తెలంగాణ కవుల కవితా ప్రాభవం
  84. బంజారాల వివాహ ఆచార పద్ధతులు
  85. కుతుబ్‌షాహీల సాహిత్య సేవ
  86. తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర
  87. తెలంగాణ చరిత్ర
  88. మావూరు మాట్లాడింది
  89. సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు
  90. తెలుగు జానపద సాహిత్యము – స్త్రీల గేయములు, సంప్రదాయాలు
  91. యాభై సంవత్సరాల జ్ఞాపకాలు
  92. తెలంగాణ మాండలికాలు – కావ్య ప్రయోగాలు
  93. తెలంగాణ గిరిజన భాషా సాహిత్యాలు
  94. పరిణతవాణి (ఏడవ సంపుటి)
  95. శేషాద్రి రమణ కవుల వ్యాసమంజరి
  96. కథనంలోనూ, కదనంలోనూ మేమే
  97. డా. దేవులపల్లి రామానుజరావు గ్రంథావళి
  98. డా. దేవులపల్లి రామానుజరావు శతజయంతి ప్రత్యేక సంచిక
  99. డా. దేవులపల్లి రామానుజరావు సంక్షిప్త జీవిత చరిత్ర
  100. పరిణతవాణి (ఎనిమిదవ సంపుటి)
  101. తెలంగాణ సారస్వత పరిషత్తు పంచసప్తతి ప్రత్యేక సంచిక
  102. పాంచజన్యము (డా. గడియారం రామకృష్ణశర్మ)
  103. డా. ముదిగంటి సుజాతారెడ్డి కథలు (మొదటి, రెండవ భాగాలు)

తెలుగు సాహిత్య ప్రయాణంలో మాతో కలవండి

Scroll to Top