హోమ్ / కార్యవర్గం
తెలంగాణ సారస్వత పరిషత్తు
కార్యవర్గం
పరిషత్తు సేవలో సాహితీవేత్తలు, విద్యావేత్తలు.
సంస్థ అభివృద్ధి
తెలంగాణ భాషా సాహిత్య కళా సంస్కృతుల పునర్వికాసానికి ఒక విధంగా తెలంగాణ సారస్వత పరిషత్తు చరిత్ర ప్రతీకగా దర్శనమిస్తుంది అని చెప్పవచ్చు. డా. బూర్గుల రామకృష్ణారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక సందర్భంలో ఇలా అన్నారు: సూర్యకిరణాలు సర్వత్రా కాంతిమయం చేసినట్లుగా పరిషత్తు రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో విజ్ఞానాన్ని పరవ్యాప్తం చేస్తున్నది. నిజమే, తెలంగాణ పురోగతిలో పరిషత్తు పాత్ర గణనీయం. బహుముఖీన కార్యక్రమాలతో పరిషత్తు ఈనాడు రాష్ట్రంలో అగ్రగణ్య సంస్థగా విలసిల్లుతున్నది. పరిషత్తు స్వర్ణోత్సవాలు హైదరాబాదులో 7-1-1994 తేదీన ఘనంగా జరిగాయి. అప్పటి భారత ప్రధాని శ్రీ పి.వి. నరసింహారావుగారు ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా విచ్చేశారు. అలాగే సప్తతి మహోత్సవాలను పరిషత్తు 23-03-2013 నుంచి 20-05-2013 వరకు వైభవంగా నిర్వహించింది. సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ నిమిత్తం తెలంగాణ ప్రభుత్వం పరిషత్తుకు వార్షికంగా రూ.10 లక్షలు ఆర్థిక సహాయం సమకూరుస్తున్నది.
పరిషత్తు పేరు మార్పు
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన దృష్ట్యా పరిషత్తు సర్వసభ్యమండలి అధ్యక్షులు డా. సి. నారాయణరెడ్డి అధ్యక్షతన 2015 ఆగస్టు 20న పరిషత్తులో సమావేశమై ఆంధ్ర సారస్వత పరిషత్తు పేరును తెలంగాణ సారస్వత పరిషత్తుగా మారుస్తూ ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించింది.
కొత్త నియమావళి
2017 మే 15న అధ్యక్షులు డా. సి. నారాయణరెడ్డి అధ్యక్షతన జరిగిన సర్వసభ్యమండలి సమావేశంలో కొత్త నియమావళిని ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. తొలుత ట్రస్టు, కార్యవర్గం కొత్త నియమావళిపై చర్చించి ఆమోదించడం జరిగింది. కాలానుగుణంగా పరిషత్తు, కార్యక్రమాలు, వాటికి అనుగుణంగా పూర్వపు నియమావళిలో మార్పులు చేయడం జరిగింది.
1993 జూన్ 27న అధ్యక్షులుగా పదవీ బాధ్యతలు చేపట్టి 2017 జూన్ 12న అస్తమించే వరకు జ్ఞానపీఠ పురస్కార గ్రహీత, పద్మభూషణ్, మహాకవి డా. సి. నారాయణరెడ్డి వినూత్న కార్యక్రమాలతో పరిషత్తును సర్వాంగీణ వికాస దశలో మార్గనిర్దేశం చేశారు.
2017 జూన్ 16న పరిషత్తు ట్రస్టు, కార్యవర్గం సమావేశమై డా. సి. నారాయణరెడ్డి సేవలను స్మరించి వారి నిర్మాణం వల్ల హార్దిక శ్రద్ధాంజలి ఘటించింది.
అప్పటి వరకు ట్రస్టు కార్యదర్శిగా కొనసాగిన సంస్కృతాంధ్ర పండితులు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ ఉపాధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి గారు ఏకగ్రీవంగా ట్రస్టు అధ్యక్షులుగా, పరిషత్తు అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. పరిషత్తు ప్రధాన కార్యదర్శిగా ఉన్న డా. జె. చెన్నయ్య గారు ట్రస్టు కార్యదర్శిగా కూడా ఎన్నికయ్యారు.
పరిషత్తు పంచసప్తతి మహోత్సవం
ఆచార్య ఎల్లూరి శివారెడ్డి నేతృత్వంలో పరిషత్తు చరిత్రలో ప్రముఖంగా పేర్కొనదగిన పంచసప్తతి మహోత్సవాన్ని 26-05-2018 నుంచి 29-05-2018 వరకు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని 75 సంవత్సరాలుగా పరిషత్తు తెలుగు భాషా సంస్కృతుల వికాసానికి చేస్తున్న కృషిని కొనియాడారు. తమ వేతనం నుంచి 5 లక్షల రూపాయలు విరాళం అందజేశారు.
పంచసప్తతి ఉత్సవాలను తెలంగాణ అంతటా ఘనంగా నిర్వహించడం జరిగింది.
మూల వెబ్సైట్లో ప్రచురించిన కార్యవర్గం
| బాధ్యత | పేరు |
|---|---|
| అధ్యక్షులు | ఆచార్య ఎల్లూరి శివారెడ్డి |
| ఉపాధ్యక్షులు | డా. కె.వి. రమణ, ఐ.ఏ.ఎస్. (విశ్రాంత) |
| ఉపాధ్యక్షులు | డా. ముదిగంటి సుజాతారెడ్డి |
| ప్రధాన కార్యదర్శి | డా. జె. చెన్నయ్య |
| కోశాధికారి | శ్రీ మంత్రి రామారావు |
| పరీక్షా కార్యదర్శి | ఆచార్య మసన చెన్నప్ప |
సభ్యులు
- ఆచార్య రవ్వా శ్రీహరి
- ఆచార్య ఎం. కులశేఖరరావు
- ఆచార్య ఎస్వీ రామారావు
- ఆచార్య ఎన్.ఆర్. వెంకటేశం
- ఆచార్య జి. చెన్నకేశవరెడ్డి
- ఆచార్య రావికంటి వసునందన్
- డా. సి. వసుంధర
- డా. తిరుమల శ్రీనివాసాచార్య
- శ్రీ పాండురంగయ్య
- శ్రీ ఎం. నరహరి
- డా. డి. చంద్రశేఖరరెడ్డి
- శ్రీ ఎ.టి.వి. కృష్ణమాచార్యులు
- శ్రీ వర్ధమాన వెంకటయ్య
ప్రత్యేక ఆహ్వానితులు
- పద్మభూషణ్ డా. కె.ఐ. వరప్రసాదరెడ్డి
- శ్రీ మామిడి హరికృష్ణ, తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ (ప్రభుత్వ ప్రతినిధి)
తెలంగాణ సారస్వత పరిషత్తు ట్రస్ట్
అధ్యక్షులు: ఆచార్య ఎల్లూరి శివారెడ్డి. కార్యదర్శి: డా. జె. చెన్నయ్య. సభ్యులు: ఆచార్య రవ్వా శ్రీహరి, శ్రీ మంత్రి రామారావు, డా. సి. వసుంధర.