హోమ్ / తెలుగు పరీక్షలు
తెలంగాణ సారస్వత పరిషత్తు
తెలుగు పరీక్షలు
తెలుగు అభ్యసనానికి పునాది వేసిన పరీక్షల సంప్రదాయం.
తెలుగు పరీక్షలు
అక్షరాస్యతా వ్యాప్తి విస్తృత ప్రాతిపదికపై సాగింది. ఈ పథకానికి మరింత ప్రామాణిక రూపం సమకూర్చటం కోసం పరిషత్తు తెలుగు పరీక్షలు నిర్వహించే నిమిత్తం ఉత్తమ ప్రణాళికను రూపొందించింది. అప్పటి నుంచి నేటి వరకు తెలుగు పరీక్షలు జరుగుతూనే ఉన్నాయి. వీటికి పట్టణ ప్రాంతాలలో, గ్రామీణ ప్రాంతాలలో అభ్యర్థుల నుంచి అనూహ్య స్పందన లభించింది. ముఖ్యంగా పాఠశాలలో చదివే అవకాశం లేని అభ్యర్థుల పరీక్షలు ఎంతో మేలు చేకూర్చినాయి. పరిషత్తు పరీక్షలు మూడు స్థాయిలలో నిర్వహింపబడుతున్నాయి. అవి (1) ప్రాథమిక (2) ప్రవేశ (3) విశారద (పూర్వోత్తర భాగాలు). తెలుగు పండితుల నియామకానికి విశారద పరీక్షలో ఉత్తీర్ణతను ప్రభుత్వం ఒక అర్హతగా పరిగణిస్తూ లోగడ ప్రభుత్వ ఉత్తర్వులిచ్చింది.
అదేవిధంగా రాష్ట్రప్రభుత్వ ఉద్యోగుల విషయంలో ప్రవేశ పరీక్ష ఉత్తీర్ణతను సెకండ్ క్లాస్ భాషా పరీక్షతో సమానమని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. చాలా సంవత్సరాల పాటు ఇతర రాష్ట్రాలలోను, మారిషస్ దేశంలోను ఈ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు వయఃపరిమితి నిబంధన లేదు. ఈ పరీక్షలు 187 కేంద్రాలలో నిర్వహించిన సందర్భాలున్నాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయం సూచనల మేరకు విశారద ఉత్తర పరీక్ష ఉత్తీర్ణానికి 4వ ప్రశ్నపత్రంలో పాఠ్యాంశంగా 1999 అక్టోబర్ నుంచి ఎస్.ఎస్.సి. ఇంగ్లీషు పాఠ్యగ్రంథాన్ని చేర్చింది.
పాఠ్యప్రణాళిక, పరీక్ష వివరాలు
మూల వెబ్సైట్ నుంచి పునరుద్ధరించిన పాఠ్యప్రణాళిక, ప్రశ్నపత్రాలు క్రింద ఉన్నాయి. ఇవి పూర్వ ప్రచురణలు. తాజా పరీక్ష తేదీలు, ఫీజులు, అర్హతలు, దరఖాస్తు విధానం కోసం పరిషత్తును సంప్రదించండి.