హైదరాబాద్, తెలంగాణ

తెలంగాణ సారస్వత పరిషత్తు

పుస్తక విక్రయశాల

పుస్తకాలు, పత్రికలు — పాఠకులకు చేరువగా.

పుస్తక విక్రయ విభాగం

పరిషత్తు తన ప్రాంగణంలో పుస్తక విక్రయ విభాగాన్ని నెలకొల్పింది. పరిషత్తు ప్రచురణలను, తమ స్వీయ ప్రచురణల విక్రయంలో తోడ్పాటుకోరిన రచయితల గ్రంథాలు పుస్తక విక్రయ విభాగంలో లభిస్తాయి. భారీ సంఖ్యలో కొనుగోళ్ళు చేసే ఇతర విక్రయ కేంద్రాల వారికి పరిషత్తు సముచితంగా రాయితీ ఇస్తుంది. 2015 అక్టోబరు మాసంలో వారం రోజులపాటు పరిషత్తు పుస్తక ప్రదర్శనను తన ప్రాంగణంలో ఏర్పాటు చేసింది. పరిషత్తు తన ప్రచురణలను మూడు విభాగాలుగా వర్గీకరించి 20%, 30%, 50% తగ్గింపు ధరలకు ఈ ప్రదర్శనలో విక్రయించింది. రూ.1 లక్షకు పైగా పరిషత్తుకు రాబడి వచ్చింది. ముద్రిత గ్రంథాలను తగినంతగా పోషించగల పాఠకులు ఉన్నారన్నది ఇది నిరూపిస్తుంది. పుస్తక విక్రయ కేంద్రంలో ఒక గుమస్తా ఉంటాడు. ఈ కేంద్రం ఉ.10.30 నుంచి సా.6.00 గం.ల వరకు పనిచేస్తుంది.

పఠనాలయం

గ్రంథాలయానికి అనుబంధంగా పఠనాలయం పనిచేస్తున్నది. విద్యార్థులు, ఇతర పాఠకులు దీనిని ఉపయోగించుకుంటున్నారు. ఇంగ్లీషు, ఉర్దూ, తెలుగు దినపత్రికలు, వారపత్రికలు ఇందులో లభ్యమవుతాయి. ఇది మధ్యాహ్నం 3:00 నుంచి రాత్రి 8:00 వరకు తెరిచి ఉంటుంది.

తెలుగు సాహిత్య ప్రయాణంలో మాతో కలవండి

Scroll to Top