హైదరాబాద్, తెలంగాణ

తెలంగాణ సారస్వత పరిషత్తు

కార్యక్రమాలు

సారస్వత వేదిక, పరిణతవాణి, గ్రంథావిష్కరణలు, సాహిత్య సభలు.

సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలు

సదస్సులు, సమ్మేళనాలు, చర్చాగోష్ఠులు, సాంస్కృతిక ప్రదర్శనలు, గ్రంథావిష్కరణలు, అధ్యయన శిబిరాలు, సంస్మరణ ప్రసంగాలు, ధర్మనిధి పురస్కార సభలు మొదలైన పరిషత్తు నిర్వహించే కార్యక్రమాలు బహుళ జనాదరణ పొందాయి. తెలుగులో కీర్తి ప్రతిష్ఠలు పొందిన ప్రముఖులెందరో పరిషత్తు కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఇదేగాక పరిషత్తు 3-10-1976 తేదీన సారస్వత వేదికను నెలకొల్పింది. విమర్శకులు కలుసుకొని సుహృద్భావ వాతావరణంలో సమాలోచనలు జరిపేందుకు ఈ వేదిక తోడ్పడుతున్నది. జరిగిన ప్రసంగ కార్యక్రమాలలో వక్తలు సమర్పించిన పత్రాలను గ్రంథరూపంలో వెలువరించే సంప్రదాయాన్ని పరిషత్తు పాటిస్తున్నది.

పరిణతవాణి

పరిషత్తు అధ్యక్ష పదవిని స్వీకరించిన మీదట డా. సి. నారాయణరెడ్డి గారు కార్యక్రమాలకు కొత్త ఒరవడి పెట్టినారు. పరిణతవాణి అనే వినూత్న ప్రక్రియకు రూపకల్పన చేసినారు. ఇది 65 ఏండ్లు దాటిన సాహితీవేత్తల స్వీయ జీవిత విశేషాలు, సాహిత్య కృషిపైన ప్రసంగ పరంపర. ఈ ప్రసంగాలు అందరి ప్రశంసలందుకున్నాయి.

ధర్మనిధి ప్రసంగాలు, సాహిత్య పురస్కారాలు

తెలంగాణ భాషా, సాహిత్య కళా సాంస్కృతిక రంగాలకు చెందిన వివిధాంశాలపై ఎన్నో కార్యక్రమాలను పరిషత్తు నిర్వహిస్తున్నది. వీటిలో ధర్మనిధి ప్రసంగాలు ప్రత్యేకంగా పేర్కొనదగినవి. తాము అభిమానించే వారి పేరిట కొందరు ధర్మనిధి సమకూర్చారు. ప్రతి సంవత్సరం పురస్కార ప్రదానం, ధర్మనిధి సంస్మరణ ప్రసంగం ఉంటాయి. ధర్మనిధి ప్రసంగాలు, సాహిత్య పురస్కారాలు దిగువ చూడవచ్చు.

  • శ్రీమతి ఎర్రంరెడ్డి రంగనాయకమ్మ సాహిత్య పురస్కారం, ప్రసంగం.
  • శ్రీ బి.ఎన్. శాస్త్రి సాహిత్య పురస్కారం, ప్రసంగం.
  • డా. బెజవాడ గోపాలరెడ్డి సాహిత్య పురస్కారం, ప్రసంగం.
  • పద్మభూషణ్ డా. కె. అంజిరెడ్డి సాహిత్య పురస్కారం, ప్రసంగం.
  • శ్రీ ఆలూరి బైరాగి సాహిత్య పురస్కారం, ప్రసంగం.
  • డా. పాకాల యశోదారెడ్డి సాహిత్య పురస్కారం, ప్రసంగం.
  • డా. దేవులపల్లి రామానుజరావు సాహిత్య పురస్కారం, ప్రసంగం.
  • డా. తిరుమల శ్రీనివాసాచార్య సాహిత్య పురస్కారం, ప్రసంగం.
  • ఆచార్య రావికంటి వసునందన్ సాహిత్య పురస్కారం, ప్రసంగం.
  • ఆచార్య మడుపు కులశేఖరరావు సాహిత్య పురస్కారం, ప్రసంగం.
  • శ్రీమతి తిరుమల స్వరాజ్యలక్ష్మి సాహిత్య పురస్కారం, ప్రసంగం.
  • శ్రీమతి నారపరాజు రాఘవసీత సాహిత్య పురస్కారం, ప్రసంగం.
  • మహాకవి వానమామలై వరదాచార్య సాహిత్య పురస్కారం, ప్రసంగం.
  • ఆచార్య జి. చెన్నకేశవరెడ్డి సాహిత్య పురస్కారం, ప్రసంగం.

కార్యక్రమాల సంచిక

మూల వెబ్‌సైట్‌లో నమోదు చేసిన ప్రత్యేక కార్యక్రమాలు:

  1. ప్రసార మాధ్యమ వ్యాఖ్యాతల అధ్యయన శిబిరం
  2. ప్రాచీన తెలుగు కావ్యాలలో గిరిజన కళారూపాలు – ప్రసంగాత్మక ప్రదర్శనలు
  3. ఆంధ్ర పితామహ, పద్మభూషణ్ శ్రీ మాడపాటి హనుమంతరావు 125వ జయంతి సందర్భంగా వారి బహుముఖ వ్యక్తిత్వంపై సదస్సు
  4. తెలుగు భాషావికాసం – చర్చాగోష్ఠి
  5. తెలుగు కథానిక శతజయంతి సదస్సు
  6. ప్రాచీన తెలుగు సాహిత్యంలో చిత్ర, శిల్పకళలు
  7. రాష్ట్రస్థాయి తెలుగు భాషా సాహిత్య సమ్మేళనం
  8. తెలుగు జానపద సాహిత్యం – మౌలిక స్వరూప సదస్సు
  9. తెలంగాణ తెలుగు కథ – సదస్సు
  10. సినీగీత రచనపై ఏడు రోజుల అధ్యయన శిబిరం
  11. సాంస్కృతిక విలేకరుల నాలుగు రోజుల అధ్యయన శిబిరం
  12. తెలంగాణ విలక్షణ జానపద కళారూపాలు – ప్రదర్శనలు, ప్రసంగాలు
  13. పరిషత్తు సప్తతి ఉత్సవాలు
  14. ప్రాచ్య కళాశాలలో తెలుగు బోధన – సదస్సు
  15. తెలంగాణలో తెలుగు సాహిత్య వికాసం – సదస్సు
  16. తెలంగాణ కవుల కవి సమ్మేళనం
  17. వచన కవిత అధ్యయన శిబిరం
  18. తెలంగాణ మాండలిక పదాలు – ప్రయోగ విశేషాలు – చర్చాగోష్ఠి
  19. తెలంగాణ ప్రాచీన నృత్య రీతులు – సదస్సు
  20. తెలంగాణ ప్రాచీన తెలుగు కవుల కవితా ప్రాభవం
  21. కుతుబ్‌షాహీల తెలుగు సాహిత్య సేవ
  22. తెలంగాణ చిత్రలేఖనం, శిల్పకళల వైభవం
  23. రాష్ట్రస్థాయి ఒగ్గు కథా ఉత్సవాలు
  24. తెలంగాణ గిరిజన భాషా సాహిత్యాలపై సదస్సు
  25. కవయిత్రులు, కథయిత్రుల సమ్మేళనం
  26. తెలంగాణ సాహిత్య సౌరభాలు
  27. తెలంగాణ రాష్ట్రస్థాయి కథా రచయితల అధ్యయన శిబిరం
  28. తెలంగాణ రాష్ట్రస్థాయి నాటక రచయితల అధ్యయన శిబిరం

చిత్రమాలిక

తెలుగు సాహిత్య ప్రయాణంలో మాతో కలవండి

Scroll to Top